Teachers as Students: టీచర్లు కూడా విద్యార్థులుగానే ఉండాలి..

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రభుత్వ పాఠశాలకు సందర్శించి వారితో మాట్లాడారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగానే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. ఆయన శనివారం మండలంలోని భవానీపురం ప్రాథమిక పాఠశాల, మున్సిపాలిటీలోని గవర్నమెంట్‌ హైస్కూల్‌, లాలాపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. బడిలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పించాలని, మరికొద్ది రోజుల్లో ఫార్మేట్‌–4 పరీక్షలు ఉన్నప్పటికీ సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు సిలబస్‌ పూర్తి చేయకపోవడంపై ఆయన భవానీపురం ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gurukul Admissions: గురుకుల పాఠశాలకు దరఖాస్తులు..

ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థికి ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధించేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు పక్క రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎక్కువే ఖర్చు చేస్తోందని, సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో ఉపాధ్యాయులకు బైజూస్‌ ట్యాబ్‌లు అందిస్తే వాటిపై సరైన అవగాహన లేకపోవడం విచారకరమని అన్నారు.

JNTU: జేఎన్‌టీయూని సందర్శించిన ఉప కులపతి..

రూ.లక్షల విలువైన ఐఎఫ్‌పీ బోర్డులను కాదని ఇప్పటికీ బ్లాక్‌ బోర్డులపై విద్యార్థులకు పాఠశాలు చెప్పడం సరి కా దని అన్నారు. ఒడియా మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు చివరి వరకు ఒడియా మాధ్యమంలోనే చదవడం భావ్యం కాదని, వారిని ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలని చెప్పారు. మరోమారు తన టీమ్‌ను ఈ ప్రాంతానికి పంపిస్తానని, అప్పటికీ అటు జిల్లా అధికారుల్లోను, ఉపాధ్యాయుల్లోనూ మార్పు రాకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడనంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల నోట్‌ పుస్తకాలు, వర్క్‌ పుస్తకాల ను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Digital Education: దివ్యాంగులకు డిజిటల్‌ బోధనతో విద్యాభివృద్ధి..

ఆయన వెంట విశాఖపట్నం జోనల్‌ ఆర్‌జేడీ మణిపాత్రుని జ్యోతి కుమారి, జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటే శ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్‌, ఉప విద్యాశాఖాధికారి ఆర్‌.విజయకుమారీ, ఏపీసీ రోణంకి జయప్రకాష్‌, బైజూస్‌ జిల్లా నోడల్‌ అధికా రులు ఎస్‌.జగదీష్‌, జి.భాస్కరరావు, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట ఎంఈఓలు కురమాన అప్పారావు, మజ్జి ధనుంజయ, సప్పటి శివరాంప్రసాద్‌, కుంబి చిట్టిబాబు, జోరాడులు ఉన్నారు.

#Tags