Science Congress Competitions: ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో సైన్స్ కాంగ్రెస్ పోటీలు

బాల విద్యార్థుల‌కు విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో సైన్స్ కాంగ్రెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వ‌హిస్తున్నట్లు డీఈఓ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విద్యార్థుల‌కు పోటీ వివ‌రాల‌ను, నియ‌మాల‌ను వెల్ల‌డించారు..
National Science Congress Competitions for students at Delhi Public School

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్‌ శాస్త్ర సాంకేతిక మండలి, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఆర్‌వీ రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని అన్ని యాజమన్యాల స్కూళ్ల నుంచి విద్యార్థులతో సైన్స్‌ ప్రాజెక్టులు చేయించి తీసుకురావాలన్నారు.

➤   Government Teachers: ఉపాధ్యాయుల మధ్య వివాదంపై.. డీఈవో ఆదేశాలు

ప్రతి పాఠశాల నుంచి ఒక గైడ్‌ టీచర్‌, ప్రతి ప్రాజెక్టుకు ఒక బాల శాస్త్రవేత్త, రెండు కాపీల ప్రాజెక్టు పుస్తకాలు, లాగ్‌ బుక్‌, నాలుగు చార్టులు మాత్రమే తీసుకురావాల్సి ఉంటుందని, ఎటువంటి నమూనాలు, ఎగ్జిబిట్స్‌ తీసుకురాకూడదన్నారు. ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థ, అర్ధం చేసుకోవడం, ఉప అంశాలపై ప్రాజెక్ట్స్‌ తీసుకురావాలని తెలియచేశారు. 9న భీమవరం కొత్త బస్‌స్టాండ్‌ వద్ద బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయాధికారి మల్లుల శ్రీనివాస్‌, 93942 38826, జిల్లా అకడమిక్‌ సమన్వయాధికారి సీహెచ్‌ రాజు, 98484 44232 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

#Tags