TS and AP Schools Holidays Due to Heavy Holidays : అత్యంత భారీ వ‌ర్షాలు..రేపు..ఎల్లుండి స్కూల్స్‌ సెల‌వులు.. ముఖ్య‌మంత్రి ఆదేశం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు పాటు భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. ఎడతెరిపిలేని వర్షాలతో ఏపీ, తెలంగాణ‌లో వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

భారీ వర్షాలు, వరద ఉద్ధృతి కారణంగా  సెప్టెంబరు 2వ తేదీ సోమవారం విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆదేశాలు పాటించని ప్రైవేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాగే వర్షాలు ఉంటే.. మంగ‌ళ‌వారం కూడా స్కూల్స్‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు..తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులకు తెలిపారు. అలాగే, అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రజలను మం‍త్రి హెచ్చరించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే...సెప్టెంబ‌ర్ 3వ తేదీన మంగ‌ళ‌వారం కూడా స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అ‍త్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు(సోమవారం) ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ ఇంఛార్జ్‌ వీసీ దానా కిషోర్‌ తెలిపారు.

#Tags