Schools Development: నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల అభివృద్ధి..!

ఇప్పటికే పలు మండలాల్లో బడులకు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా వసతులను ఏర్పాటు చేస్తున్నారు.. బడులకు లభించిన వైభవాన్ని పరిశీలించండి..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. సర్కారు బడులను మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తోంది. వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 1000కి పైగా పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది. రెండో విడతలో మరో 1,300లకు పైగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తోంది. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తోంది.

IT Employees: దారుణం.. ఖాళీ అవుతున్న ఐటీ ఉద్యోగుల జేబులు!!

ఇప్పటికే రూ.266 కోట్లతో పనులు

జిల్లాలో నాడు–నేడు రెండో విడత పనులను రూ.466.94 కోట్ల అంచనాతో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.266 కోట్లు ఖర్చు చేసింది. నాడు–నేడు పనులు పారదర్శకంగా జరిగేలా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రెండో విడత నాడు–నేడు పనులను ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాలో రెండో విడత నాడు–నేడు పనులు చకచకా జరుగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

GO4Youth Olympiad 2024: గ్రీన్‌ ఒలింపియాడ్‌ ఫర్‌ యూత్‌ 2024, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు ‘మన బడి నాడు–నేడు’ పేరుతో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో రూ.231.40 కోట్లతో జిల్లాలోని 1,060 ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను కల్పించింది. రెండో విడతలో రూ.466.94 కోట్ల అంచనాలతో జిల్లాలో మొత్తం 1,380 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నాడు–నేడుతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌, వర్చువల్‌ బోధన, టోఫెల్‌లో శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ తదితర వాటిని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితోపాటు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద తదితర పథకాలను పేద విద్యార్థుల కోసం అమలు చేస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది.

Telangana Public Schools: తెలంగాణలో పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాట్లు..!!

రెండో విడతలో..

నాడు–నేడు కార్యక్రమం రెండో విడతలో భాగంగా జిల్లాలోని మొత్తం 1,380 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో 865 ప్రాథమిక, 247 ఉన్నత, 136 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 108 అంగన్‌వాడీ కేంద్రాలు, ఒక డైట్‌ కళాశాల, ఒక బీఈడీ కళాశాల ఉన్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి.

Telangana: ‘తెలంగాణ ఇంక్రిమెంట్‌’ రికవరీ

త్వరితగతిన పనులు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 39 అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. మరో 69 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు నిర్మాణాల్లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 336 ప్రహరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 34 పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 919 మరుగుదొడ్లను నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటికే 225 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మొత్తం 412 వంట గదుల్లో 135 నిర్మించారు. అలాగే మేజర్‌, మైనర్‌ రిపేర్లలో భాగంగా తరగతి గది, మరుగుదొడ్లకు సంబంధించి 904 పాఠశాలల్లో 284 చోట్ల మరమ్మతులు పూర్తి చేశారు. మొత్తం 905 విద్యుద్దీకరణ పనుల్లో 470 పనులు పూర్తి చేశారు. ఆయా పాఠశాలల్లో 352 అదనపు తరగతి గదుల్లో 80 నిర్మాణం పూర్తి చేశారు. ఇసుక, సిమెంట్‌, ఫ్యాన్లు, లైట్లు తదితర వాటిని రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తోంది.

TRR College: టీఆర్‌ఆర్‌ కళాశాలలో రీసెర్చ్‌ సెంటర్‌

అధునాతన వసతులు

జిల్లాలో తొలి విడతలో 1,160 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి రూ.231.40 కోట్లతో మౌలిక వసతులు. రెండో విడతలో 1,248 పాఠశాలల్లో పనులు. ఇప్పటి వరకు రూ.266 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మార్చిలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది.

Indian Workers: చలో తైవాన్.. భారతీయుల‌కు లక్షల్లో ఉద్యోగాలు!!

మార్చి లోపు పనులు పూర్తి చేస్తాం

రెండో విడత నాడు–నేడు పనులను మార్చి లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే 50 శాతం మేర పనులు పూర్తి చేశాం. నాడు–నేడు పనులను పారదర్శకంగా నిర్వహించేలా క్షేత్రస్థాయిలో ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనులను పూర్తి చేస్తాం.

– ఉషారాణి, ఏపీసీ, సమగ్ర శిక్ష

Academic Examination: 23 నుంచి విద్యార్థులకు పరీక్షలు

ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సర్కారు బడుల్లో అదనపు తరగతి గదులు, మైనర్‌, మేజర్‌ మరమ్మతులు, ప్రహరీలు, కుర్చీలు, బెంచ్‌లు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు, తలుపులు, ఆర్‌ఓ ప్లాంట్లు, టైల్స్‌తోపాటు సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌, బాలుర, బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు తదితర వసతులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో జిల్లాలోని 1,060 పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించింది.

#Tags