School Holidays Extended 2024 : గుడ్‌న్యూస్.. స్కూల్స్ సెలవులు పెంపు.. కానీ..!
తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో మార్పులు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ సెలవులను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోంది. అయితే ఇది వేసవి సెలవుల గురించి కాదు. ప్రభుత్వం ప్రకటించిన పండగ సెలవుల గురించి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్‌లో పండగలకు ఇచ్చే సెలవులు ఎక్కవగా ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అభిప్రాయపడింది. అలాగే తొలి ఏకాదశి పండుగకు సెలవు ఇవ్వాలని సూచించింది. దీపావళి పండుగకు కూడా రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
అదే విధంగా మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేయాలని కోరారు. వారి అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే పాఠశాలలకు సెలవులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో 1-10వ తరగతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
అలాగే వచ్చే ఏడాది వేసవి సెలవులను కూడా..
అలాగే ఈ విద్యాసంవత్సరం ఏప్రిల్ 24, 2025న ముగుస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేస్తాయి. అదే విధంగా వచ్చే ఏడాది వేసవి సెలవులను కూడా ఈ అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.
☛ Engineering: ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి? ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులేంటి?
పండగ సెలవులు ఇలా.. కానీ..
దసరా సెలవులు 2024 అక్టోబర్ 2-14 నుంచి దాదాపు 13 రోజుల పాటు కొనసాగుతాయి. 2025 సంక్రాంతి సెలవులు జనవరి 13-17 నుంచి మొత్తం 5 రోజులు ఉంటాయి. అలాగే 2024లో 27 సాధారణ సెలవులు.., 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. జనవరి 15వ తేదీన సంక్రాంతి సెలవులు, మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళి హాలీడేస్ ఇస్తున్నారు.