School holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూళ్లకు వరుసగా సెలవులు.. ఎందుకంటే!

భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
School holidays Due To Heavy Rainfall Alert In andhra pradesh

బంగాళా­ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల25న వాయుగుండంగా బలపడే  సూచ­నలున్నా­యని విశాఖ తుపాను హెచ్చరి­కల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈనెల 29న.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Tomorrow All School Closed : రేపు అన్ని స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. ఎందుకంటే...?

భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈనెల 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో వాతావరణ ప్రభావాన్ని బట్టి పాఠశాలలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags