School Fees : ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి..
కడప: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ తరగతులవారీగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో విద్యార్థుల తల్లితండ్రులకు తెలియచేసే విధంగా ఏర్పాటు చేయాలని డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫరా చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తప్పవని డీఈఓ అనురాధ హెచ్చరించారు.
Free TGPSC Group 2 Grand Tests: గ్రూప్–2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానం
#Tags