Schools Re-Open: పాఠ‌శాల‌ల్లో రేప‌టినుంచి ప్రారంభం కానున్న నూత‌న విద్యాసంవ‌త్స‌రం..

ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి 2024–2025 విద్యా సంవత్సరం బడిగంటలు మోగనున్నాయి. విద్యార్థుల ఉరుకులు పరుగులు.. కేరింతలు.. మొదలవనున్నాయి..

హైద‌రాబాద్‌: వేసవి సెలవులు పూర్తయ్యాయి.. మళ్లీ బడికి వేళవుతోంది.. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని.. రారా రమ్మని.. స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు నగరంలోని పలు సర్కారు బడులు ఇంకా సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి 2024–2025 విద్యా సంవత్సరం బడిగంటలు మోగనున్నాయి. విద్యార్థుల ఉరుకులు పరుగులు.. కేరింతలు.. మొదలవనున్నాయి.. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయగా.. సర్కారు బడులు మాత్రం అలంకరణలకు ఆదేశాలు క్రమంలోనే ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్‌ పాఠశాలలు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా.. దీనిపై విద్యాశాఖ మాత్రం కిమ్మనకుండా ఉందని తల్లిదండ్రులు వాపోతూ.. తమ తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

AP EAMCET 2024 Toppers: ఎంసెట్‌ ఫలితాల్లో టాపర్స్‌.. శ్రీశాంత్ రెడ్డికి ఫస్ట్‌ ర్యాంక్‌

రేపటి నుంచి సందడి షురూ..

బుధవారం నుండి నూతన విద్యా సంవత్సరం (2024– 2025) ఆరంభం కానుంది. ప్రతి ఉదయం విద్యార్థులు ఓ పక్క, వారి తల్లిదండ్రులు మరో పక్క ఉరుకులు పెట్టనున్నారు. అటెన్షన్‌ప్లీజ్‌..సైలెన్స్‌ ప్లీజ్‌.. అంటూ టీచర్ల పని ప్రారంభం కానుంది. ఇక విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఇటు సర్కారు.. అటు కార్పొరేట్‌ పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సర్కారు బడుల్లో తరగతి గదులను అందంగా అలంకరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయగా.. కార్పొరేట్‌ విద్యాసంస్థలు అలంకరణలు, అడ్మిషన్లు వంటి ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశాయి. బడ్జెట్‌ పాఠశాలలు కొత్త విద్యార్థులను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన ఫలితాలతో ఆకర్షణీయ ప్రకటనలు, పాంప్లెట్లతో ప్రచారం ప్రారంభించాయి.

UGC: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లొ రెండుసార్లు అడ్మిషన్లు

22.40 లక్షల మంది విద్యార్థులు

గ్రేటర్‌ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు కలిసి సుమారు 7,587 ఉండగా, అందులో దాదాపు 22.40 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 2,902 స్కూల్స్‌లో 9.72 లక్షల మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లాలో 2761 స్కూల్స్‌లో 6.70 లక్షల మంది విద్యార్థులు, మేడ్చల్‌ జిల్లాలో 1,924 స్కూల్స్‌లో 6.06 లక్షల మంది విద్యార్థులున్నారు. మొత్తం మీద ప్రైవేటు పాఠశాలల సంఖ్య అధికంగా ఉంది. సుమారు ఆరు వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నది అధికారుల అంచనా. అందులో దాదాపు సుమారు 17 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Digital Teaching: బోధ‌న స‌మ‌యంలో ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీని ఉప‌యోగించాలి.

ఖాళీలే.. ఖాళీలు..

సర్కారు బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఉద్యోగ విరమణతో ఖాళీలు భర్తీ కావడం లేదు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణుల పోస్టుల భర్తీ అంతంత మాత్రంగా ఉందని, దీంతో విద్యార్థుల చదువులు భారంగా మారుతున్నాయనేది తల్లిదండ్రుల వాదన. దీనిని గత విద్యా సంవత్సర పదవ తరగతి ఉత్తీర్ణతా శాతం మరింత బలపరుస్తోంది. ఇక ప్రైవేటు విద్యా సంస్థల్లో తక్కువ వేతనాలకు పనిచేసే టీచర్ల నైపుణ్యం అంతంత మాత్రంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు, ప్రైవేటులో టీచర్ల నైపుణ్యత లేమి..మొత్తంగా ఈ ఏడాదీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి.

Dayalbagh Educational Institute: డీఈఐ అందిస్తున్న ప‌లు కోర్సులు ఇవే.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

నత్తనడకన.. అమ్మ ఆదర్శ పనులు..

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పనులు అంతంత మాత్రంగా నత్త నడకన సాగుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులు సగం కూడా పూర్తి కాలేదు. సాక్షాత్తు విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ లేమితో పనులు ముందుకు సాగడం లేదు. హైదారాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి.

AP EAMCET Results Released: ఎంసెట్‌-2024 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తప్పని ఆర్థిక ఒత్తిళ్లు..

ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక ఒత్తిళ్లు తప్పడం లేదు. డొనేషన్లు, స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ తదితర ఖర్చులతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. కొద్దోగొప్పో సంపాదనాపరుల పరిస్థితి ఇలా ఉంటే...చాలీచాలని వేతనాలతో కాలం గడిపే అసంఘటిత కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులు చదువు కోసం సాధారణ బడ్జెట్‌ స్కూల్లోనే రూ.లక్షకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుందనేది ఫీజుల పట్టికను చూస్తే అర్థమవుతుంది.

బహదూర్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో.. నిబంధనలకు విరుద్ధంగా..

కొన్ని ప్రైవేటు స్కూల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీ వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌ డీఈఓ ప్రత్యేకంగా సర్క్యులర్‌ జారీ చేసినా..ఫలితం లేకుండా పోయింది. స్కూల్స్‌ ప్రాంగణాల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్‌, టై, డైరీ, షూస్‌ ఇలా విద్యార్థులకు కావాల్సి సకల సరంజామా బాహాటంగా విక్రయిస్తున్నాయి. కొన్ని స్కూల్స్‌ అయితే విద్యా సంస్థ పేరుతో ఎంఆర్‌పీ ధరలను ముద్రించుకుని విద్యార్థులకు అంటగడుతున్నాయి. ఇతర షాపుల్లో కొనుగోలు చేసిన నోట్‌ పుస్తకాలను అనుమతించబోమని స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడే కొనుగోలు చేస్తున్నారు.

Government Recognition: ప్ర‌భుత్వ నుంచి గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లోనే విద్యార్థుల ప్ర‌వేశం.. త‌ల్లిదండ్రుల‌కు ఇవే ముఖ్య సూచ‌న‌లు..!

#Tags