No Education Funds : పాఠశాల అభివృద్ధికి నిధులు లేక ప్రధానోపాధ్యాయులే స్వయంగా..!
నెల్లూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా, ప్రభుత్వ పాఠశాలలపై ఏ మాత్రం దృష్టి సారించలేదనే అంశం వారి వైఖరితో స్పష్టమవుతోంది. వాస్తవానికి స్కూళ్ల అవసరాల రీత్యా ఏటా నిర్వహణ నిధులను మంజూరు చేస్తారు. అయితే ఈ అంశాన్నే ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ప్రధానోపాధ్యాయులపై ఆ భారం పడుతోంది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
జిల్లాలో 2592 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక 2021.. ప్రాథమికోన్నత 238.. హైస్కూళ్లు 283, హైస్కూల్ ప్లస్ 50 వరకు ఉన్నాయి. ఇందులో 1,81,392 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీటికి సంబంధించిన నిర్వహణ నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదలవుతాయి. తరగతి గదుల్లో వినియోగించే చాక్‌పీస్, డస్టర్, రిజిస్టర్లతో పాటు ఫ్యాన్లు, లైట్లు తదితరాలకు ఈ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంది.
ఎప్పటికి వస్తాయో..?
పాఠశాల నిర్వహణ నిధులను ఈ ఏడాది విడుదల చేస్తారాననే అంశం ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. నిధులు విడుదలకు నోచుకోకపోవడంతో ప్రతి పైసాను ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి తీయాల్సి వస్తోంది. ఈ గ్రాంట్‌ను మంజూరు చేయకపోతే రానున్న రోజుల్లో పాఠశాల నిర్వహణ కష్టమనే భావన వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు తల్లికి వందనాన్ని ఈ ఏడాది ఇచ్చేది లేదని శాసనసభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. దీన్నే ఇవ్వకపోతే ఇక నిర్వహణ నిధుల సంగతేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మెయింటెనెన్స్ గ్రాంట్‌ను త్వరగా విడుదల చేసేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
Job Offer: బంపర్ ఆఫర్.. రోజుకు రూ.28000 జీతం.. ఏడు గంటలే పని!!
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత.. విడుదలకు నోచుకోని నిర్వహణ నిధులు.. వెరసి అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో చాక్‌పీస్.. డస్టర్.. స్వల్ప మరమ్మతులు.. కాగితాలు.. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు అవసరమైన చీపురు మొదలుకొని ఫినాయిల్ వరకు ఏది కొనుగోలు చేయాలన్నా ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఈ నిధుల వ్యవహారమై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిధులింకా రాలేదు
పాఠశాల నిర్వహణ నిధులు ఈ ఏడాది ఇంకా మంజూరు కాలేదు. గతంలో అమ్మఒడి నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి వీటిని అందజేసేవారు. ఈ ఏడాదికి సంబంధించిన నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి వచ్చిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో జమచేస్తాం.
– ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష
పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహణ నిధులను నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సకాలంలో మంజూరు చేసేవారు. విద్యార్థులకు అందజేసే అమ్మఒడి నిధుల నుంచి రూ.వెయ్యిని మినహాయించి పాఠశాలల్లో అవసరమయ్యే ప్రతి వస్తువునూ కొనుగోలు చేసేందుకు ఈ నిధులను కేటాయించేవారు. విద్యాసంస్థలను ప్రారంభించిన వెంటనే ఈ నిధులను విడుదల చేసేవారు. దీంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమకూరేవి.
Students Future : విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణల్లో ముందుండాలి.. వీరే భవిష్యత్తుకు..