Girls Gurukul Admissions: మైనార్టీ గురుకులంలో పరీక్ష లేకుండానే ప్రవేశాలు!
చిత్తూరు: జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్‌లు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి చిన్నారెడ్డి వెల్లడించారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలల్లో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్శిక్, బౌద్ధులు, జైను కులస్తుల విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయకుండానే అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు.
Tenth Supplementary: ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
జిల్లా కేంద్రంలోని మురకంబట్టు మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 63, 6వ తరగతిలో 55, 7వ తరగతిలో 48, 8వ తరగతిలో 47 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి సౌకర్యం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, కాస్మొటిక్ చార్జీలు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వివరాలకు 8712625058, 9441155061 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
TS EAMCET Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే..