NAS Exam : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు నాస్.. ప‌రీక్ష విధానం ఇలా!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను అంచనా వేసేందుకు నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌) పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నారు.

అగళి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను అంచనా వేసేందుకు నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌) పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్ష నిర్వహిస్తుండగా... 2021లో చివరి సారిగా జరిగింది. మరలా ఈ ఏడాది పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఎస్‌సీఈఆర్‌టీ చర్యలు చేపట్టాయి. వచ్చే నెల 4న నాస్‌ పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది నవంబర్‌ 3న స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సిస్‌) పేరుతో మండల స్థాయిలో సర్వే పూర్తయింది. దీని ఆధారంగా విద్యార్థుల విద్యాప్రమాణాలు అంచనా వేశారు.

Indian Startup: భార‌త్‌లో ప్రస్తుతం 1.53 లక్షలకు పైగా స్టార్టప్‌లు.. ఈ రాష్ట్రాల్లో..

పరీక్షలు ఇలా....

ఎస్‌సీఈఆర్‌టీ నిర్వహించే నాస్‌ పరీక్షకు మందుగా ప్రాక్టీస్‌ పేపర్ల ద్వారా తర్పీదు ఇస్తారు. 3, 6 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతి విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌, సైన్స్‌ పాఠ్యాంశాలపై పరీక్షలు ఉంటాయి. 3వ తరగతి విద్యార్థులకు అదే తరగతి సిలబస్‌, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్‌, 9వ తరగతి విద్యార్ధులకు 8వ తరగతి సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు. 3వ తరగతి విద్యార్థులు 45 మార్కులకు 90 నిమిషాల వ్యవధి, 6వ తరగతి విద్యార్థులు 51 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధి, 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలకు 120 నిమిషాల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఒక్కో పాఠశాల నుంచి 30 మంది

నాస్‌ పరీక్షకు జిల్లాల్లో 93 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లాస్థాయి కో–ఆర్డినేటర్‌గా డీఈఓ, సహాయ కో–ఆర్డినేటర్‌గా డీసీఈబీ కార్యదర్శి వ్యవహరిస్తారు. నిర్వహణ ప్రక్రియను సమగ్ర శిక్ష ఏఎంఏ, డైట్‌ ప్రిన్సిపాల్‌, డీఈఓ కార్యాలయ ప్రతినిధి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్లు పరిశీలిస్తారు. మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా ఎంఈఓలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. డైట్‌, బీఎడ్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, పీజీ విద్యార్థులతో పాటు శాస్త్ర ఛాత్రోపాధ్యాయులను ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా నియమించనున్నారు.

JEE Advanced : 2025 మే రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌!

త్వరలో శిక్షణ

నాస్‌ పరీక్షల నిర్వహణకు ఎంపికై న ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు, అబ్జర్వర్లు, మండల విద్యాశాఖాధికారులకు త్వరలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. పరీక్షల నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కలిగిస్తాం.

– కృష్ణప్ప, డీఈఓ

పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో నాస్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంపిక చేసిన పాఠశాలల్లోనే విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తాం. విద్యార్థుల్లో అభ్యాసనా సామర్థ్యాలు గుర్తించడానికి, అనంతరం వారికి మరింత ఉన్నత ప్రమాణాలతో బోధనను అందించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయి.

– భాస్కరరెడ్డి, పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags