విద్యార్థుల ప్రాజెక్టుకు నాసా అవార్డు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: అంతరిక్షంలో జనజీవన విధానాలకు అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేయడానికి రూపొందించిన ప్రాజెక్టును నాసా అవార్డు వరించింది.
విద్యార్థుల ప్రాజెక్టుకు నాసా అవార్డు

ప్రాజెక్టు తయారు చేసిన శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు పి.అనిరుధ్‌, ఎస్‌.కౌషిక్‌రామ్‌, టి.దయాన్‌ అద్వైత్‌, ఎన్‌.అక్షయ్‌రెడ్డి, ఎ.చాణక్య, టి.సాయిశ్రీనివాస్‌, రిషల్‌ విదాంత్‌, ఎ.అభినవ్‌రెడ్డి బృందానికి నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో జాతీయ స్థాయి ద్వితీయ బహుమతి లభించింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్‌ జూలై 27న‌ మాట్లాడుతూ.. నేషనల్‌ స్పేస్‌ సొసైటీ, నాసా ఎయిమ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తాయని తెలిపారు.

6 నుంచి 12వ తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పోటీలకు పంపిన ప్రాజెక్టులను దేశంలోని ఏరోస్పేస్‌ నిపుణులు పరిశీలిస్తారని, తమ పాఠశాల విద్యార్థులు గతేడాది ఒక ప్రాజెక్టును పంపినా ఎంపిక కాలేదని చెప్పారు.

ఇప్పుడు పంపిన ప్రాజెక్టు నాసా జాతీయ స్థాయి బహుమతికి ఎంపికై నట్లు మెయిల్‌లో అధికారిక ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టుకు వికాస్‌ స్పేస్‌ కాలనీగా పేరుందని తెలిపారు. జిల్లాలో ఇలాంటి ప్రతిష్టాత్మక బహుమతి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులకు అభినందించారు.

#Tags