Students Federation of India: ఇంటర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలలైన శ్రీచైతన్య, నారాయణ, ఇతర కళాశాలలు పదోతరగతి విద్యార్థులకు ముందస్తుగా స్కాలర్‌షిప్, నీట్, మెయిన్స్, టాలెంట్ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు చేయిస్తున్నారని, అలాంటి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 28(గురువారం) భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు ఇంటర్ ప్రవేశాలకు తేదీలు ప్రకటించకముందే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు బ్రోకర్లను నియమించుకొని పరీక్షలు నిర్వహిస్తూ ప్రవేశాలు చేస్తున్నారని, స్థానికంగా ఉన్న జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేయకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Applications for Gurukula: గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
Published date : 30 Dec 2023 12:19PM