Mana Ooru Mana Badi: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు శ్రీకారం.. మన ఊరు మన బడి పథకం అమలుతో..!

సర్కారు బడుల్లో వసతులను కల్పించేందుకు మన ఊరు మన బడి పతకంతో అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించేలా చర్యలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే..

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ పథకం అమలుకు జిల్లాలో అడుగులు వేగంగా పడుతున్నాయి. జూన్‌ 10లోగా పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విద్యాశాఖ, ఇంజినీరింగ్‌శాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 651 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 36,322 మంది చదువుతున్నారు. మొదటి విడతగా 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత మొత్తం 230 పాఠశాలలను ఎంపిక చేశారు.

Model School Entrance Exam: మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో తనిఖీ.. హాజరైన విద్యార్థుల సంఖ్య!

ఇటీవలే విద్యార్థులు లేని 46 పాఠశాలలను మినహాయించి మొత్తంగా 375 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారు ఆయా పాఠశాలలను సందర్శించి, పాఠశాల విద్యా కమిటీ, ప్రధానోపాధ్యాయులతో చర్చించి ఒక్కోబడికి రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

TS 10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

375 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీలు ఇటీవలే రద్దు కావడంతో వాటి స్థానంలో ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీలను తీసుకవచ్చింది. వీటి బాధ్యతలను పాఠశాల పరిధిలోని మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి అప్పగించింది. 375 పాఠశాలల్లో కమిటీల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తయింది. ఈ పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు లక్ష చొప్పున జిల్లా మొత్తంగా రూ.3.75 కోట్లు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

SBI Workers Salary: ఎస్‌బీఐ కాంట్రాక్టు వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి

చేపట్టనున్న పనులివే..

ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద 12 రకాల మౌలిక వసతులు కల్పించనున్నారు. పాఠశాలలో నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్‌, పాఠశాలకు మొత్తం పెయింటింగ్‌, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు, డిజిటల్‌ విద్య అమలు వంటి సదుపాయాలను సమకూర్చనున్నారు. జూన్‌ 10 నాటికి ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

TS Inter Results 2024 : 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈసారి ఇలా..

#Tags