Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షలకు ఆఖరి తేదీ..!

విద్యార్థుల గురుకుల ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తున్న మాట తెలిసిందే.. అయితే, దానికి దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీని ప్రకటించారు..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈనెల 20వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి కనగాల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Green School: 'హరిత'లో కుల్లూరు జెడ్పీకి విజయం.. ఢిల్లీలో పురస్కారం..!

4వ తరగతి పూర్తి చేసి ఐదవ తరగతిలో చేరడానికి నిర్వహించే పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 11న జిల్లా కేంద్రంలో పరీక్ష ఉంటుందని, మెరిట్‌ ఆ ధారం అడ్మిషన్‌ కేటాయిస్తామని పేర్కొన్నారు.

#Tags