Schools and Colleges Holidays : బ్రేకింగ్ న్యూస్‌.. నేటి నుంచి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు స్కూల్స్ సెల‌వులు.. ఎందుకంటే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు భారీగా ఇస్తున్న‌విష‌యం తెల్సిందే. అలాగే ఎక్కువగా జ‌న‌వ‌రి నెల‌లోనే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.

కానీ నార్త్ ఇండియాలో స్కూల్స్‌, కాలేజీల‌కు శీతాకాలం సెలవులను ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో ప్ర‌క‌టించారు.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

ఈనెల 14 వరకూ స్కూల్స్‌..
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్‌లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. 

జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌కు..

ఇప్పుటికే వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు 2024 ఏడాదిగాను సెల‌వుల‌ను ముందుగానే అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు తాజాగా చ‌లి తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉండ‌టంతో ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్కూల్స్‌కు జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది హర్యానా ప్ర‌భుత్వం. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరిగి ఈ స్కూల్స్ జ‌న‌వ‌రి 16వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.

 AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

#Tags