ITDA: ఉపాధ్యాయుల జాబితా తయారు చేయండి

రంపచోడవరం: రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్‌ల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలు, ఉపాధ్యాయుల వివరాలతో జాబితా అందజేయాలని పీవో సూరజ్‌ గనోరే ఆదేశించారు. పీవో తన చాంబర్‌లో శుక్రవారం గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌, ఏటీడబ్ల్యూవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను, సీఆర్‌టీలను సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రెండు ఐటీడీఏల పరిధిలోని విద్యార్థుల జాబితాను కూడా తయారు చేయాలన సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయాలని, వారానికి రెండు రోజులు స్కిన్‌ లెస్‌ చికెన్‌ విద్యార్థులకు పెట్టాలన్నారు. టెండర్‌ దారుల నుంచి తాజా కూరగాయలు తీసుకుని విద్యార్థులకు వండి పెట్టాలన్నారు. విద్యతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీడీ జాన్‌రాజ్‌, ఏటీడబ్ల్యూఓలు సుజాత, రామ తులసి, హాసిని తదితరులు పాల్గొన్నారు.

Education system: ప్రాథమిక విద్య మరింత పటిష్టం

#Tags