Half day School 2024 Telangana : రేపటి నుంచే ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ ఇవే.. ఈ నిబంధనలు తప్పనిస‌రిగా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తం ఎండ‌లు మండుతున్నాయి. ఈ ఎండ తీవ్ర‌త‌తో విద్యార్థులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. 

అప్పటివరకు ఒంటిపూట బడులు..

తెలంగాణలో పదోతరగతి ప‌బ్లిక్‌ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

#Tags