Gurukula School Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Gurukula School Admissions Notification

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో 2024–2025 సంవత్సరానికి గానూ 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త ఎస్‌.రూపవతి తెలిపారు.

కంచరపాలెంలోని డాక్టర్‌ బి ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల కార్యాలయంలో మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. మేహాద్రి గెడ్డ, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌(కొమ్మాది), కోనాం, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం, నక్కపల్లి(నర్సీపట్నం)లోని బాలికల గురుకుల పాఠశాలలు, సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, గొలుగొండలోని బాలుర గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 23లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

5వ తరగతిలో ప్రవేశానికి మార్చి10 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు https:// apbragcet.apcfss. in/ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, వివరాలకు 0891– 2799641 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

#Tags