Facilities in Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సర్కారు శ్రీకారం..

ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రతీ బడుల్లో కావాల్సిన విధంగా చేయాల్సిన మార్పులు, నిర్మించాల్సిన వసతులను గమనించాలని ఆదేశించింది ప్రభుత్వం..

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర పనుల్లో భాగంగా ఐదు రకాల వసతులు కల్పించనుంది. ఇటీవల నూతనంగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మరమ్మతులకు షెల్ప్‌ ఆఫ్‌ వర్క్స్‌ కింద నిధులు కేటాయించింది. ఇప్పటికే అధికారులు యూనిట్‌ కాస్ట్‌ ఆధారంగా పాఠశాల బడ్జెట్‌ తయారు చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. విద్యార్థులకు తాగునీరు, తరగతి గదులకు మరమ్మతులు, విద్యుద్దీకరణ, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి వినియోగంలోకి తేవడం, బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. సాంకేతిక సహకారం కోసం ప్రతీ మండలానికి ఒక ఏఈని నియమించారు. జూన్‌ 10లోగా పనులు పూర్తిచేసి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి బడులను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు.

AP Students Excel In World Power Championship: జాతీయ స్థాయి ఇంగ్లిష్‌ పోటీల్లో ఏపీ ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ

రూ.5కోట్లతో ప్రతిపాదనలు..

జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం మొత్తం రూ.5 కోట్లు మంజూరు చేయనుంది. ఇందుకు కావాల్సిన పనుల ప్రతిపాదనలు కలెక్టర్‌కు నివేదించారు. నిధుల ఖర్చు, మరమ్మతులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు చేపట్టనున్నారు. పాఠశాలలో తాగునీరు, చిన్న తరహా మరమ్మతులు, టాయిలెట్ల మరమ్మతులు, విద్యుద్దీకరణ పనులు చేపట్టనున్నారు. జిల్లాలోని 438 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 154 పాఠశాలలను ఎంపిక చేశారు.

Angara-A5 Rocket: అంగారా-A5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన రష్యా

నిధుల వినియోగం కోసం ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిచారు. కేటాయించిన పనులు వాస్తవంగా ఆ పాఠశాలకు అవసరం ఉన్నాయా లేదా అనే విషయాన్ని సాంకేతిక నిపుణుడు, ఏఈ పాఠశాలను సందర్శించి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మంజూరైన బడ్జెట్‌కు లోబడి పనులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. గతంలో మన ఊరు మన బడి పథకం కింద మంజూరైన పాఠశాలల్లో పాత పనులు కొనసాగుతున్నాయి. కొత్త పనులకు కూడా ప్రతిపాదనలు పంపారు. పాత పనులకు సంబంధించి చాలామందికి బిల్లులు చెల్లించాల్సి ఉండగా దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

Tenth to University Exams: టెన్త్‌ నుంచి యూనివర్సిటీ పరీక్షల వరకు ప్రక్షాళన చేయాల్సిందే..!

#Tags