CBSE Syllabus News: పాఠశాలల్లో CBSE సిలబస్‌ అమలు ఎప్పటినుంచి అంటే...

CBSE Syllabus news

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన చేపడతామని సంస్థ సీఎండీ బలరామ్‌ సోమవారం వెల్లడించారు.

3days School Holidays News: మరో 3 రోజులు స్కూళ్లకు సెలవు ఎందుకంటే..?

ఇందుకో సం ప్రయోగాత్మకంగా ఎంపికచేసిన రామగుండం–2 ఏరియాలోని యైటింక్లయిన్‌ కాలనీ సెక్టార్‌–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ విద్యా బోధన అమలు చేస్తామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్ల లు, పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ప్ర మాణాలు, ఉద్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇందుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధీనంలోని సీబీఎస్‌ఈ బోర్డుకు దరఖాస్తు సమర్పిచామని తెలిపారు. త్వరలోనే సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతస్థాయి బృందం వచ్చి పాఠశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి నివేదిక రూపొంది స్తుందని వివరించారు.

నివేదిక ఆధారంగా విద్యాబోధన ప్రారంభించేందుకు అనుమతి ఇస్తారని పే ర్కొన్నారు. తొలుత సెక్టార్‌–3 పాఠశాల, ఆ తర్వాత శ్రీరాంపూర్‌ ఏరియాలోని స్కూల్‌లో సీబీఎస్‌ఈ విద్యావిధానం ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే సింగరేణిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలను ఆధునికీకరణ ప్రక్రియ ప్రారంభించామన్నారు.

#Tags