Four Days Schools Holidays 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్.. ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్, కాలేజీ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఈ నెల‌లో అనుకోకుండా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు భారీగా వ‌చ్చాయి.

స్కూల్స్‌. కాలేజీ విద్యార్థులు ఈ సెల‌వుల‌తో ఎంజాయ్‌ చేసుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ పోలీసు రిక్రూట్‌మెంట్ దృష్ట్యా.. స్కూల్స్‌, కాలేజీల‌ను వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు మూసివేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

➤☛ September Month Schools and Colleges List 2024 : స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులే.. సెలవులే.. మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్‌ అంటే..?

ఈ కారణంగా మూసి ఉంచాలని ఆదేశాలు జారీ...యూపీ పోలీసు రిక్రూట్‌మెంట్, జన్మాష్టమి పండుగ దృష్ట్యా.. గోరఖ్‌పూర్‌లోని పాఠశాలలు, కళాశాలలను నాలుగు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించాలని గోరఖ్‌పూర్ డీఎం కృష్ణ కరుణేష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కళాశాలలతో పాటు అన్ని బోర్డుల పాఠశాలలు ఆగస్టు 26 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 23, 24 తేదీల్లో పోలీసు రిక్రూట్‌మెంట్, 25న ఆదివారం, ఆగస్టు 26న జన్మాష్టమి పండుగ కారణంగా మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని డీఎం కృష్ణ కరుణేష్‌ తెలిపారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆగస్టు 26వ తేదీన(సోమ‌వారం) జన్మాష్టమి పండుగ సంద‌ర్భంగా.. ఏపీ, తెలంగాణ‌లో స్కూల్స్‌, కాలేజీల్లో సెల‌వు ఉంటుంది.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

#Tags