Germany Representatives: అంబేడ్కర్‌ స్తూల్‌ను సందర్శించిన జర్మనీ ప్రతినిధులు

డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ హైస్కూల్‌ను సందర్శించారు జర్మనీ ప్రతినిధుల బృందం. అక్కడి వసతులను, విద్యార్థులకు అందే బోధన, తదితర విషయాలను తెలుసుకొని ఇలా మాట్లాడారు..

భవానీపురం: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విద్యా అకాడమీ హైస్కూల్‌ను జర్మనీ దేశానికి చెందిన అల్టలాండ్స్‌బర్గ్‌ సిటీ ఎక్స్‌ మేయర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గుజ్జల రవీంద్ర, జర్మనీ దేశ ప్రతినిధుల బృందం సందర్శించింది. వారిలో బుడ్డిగ జమీందార్‌, గాబ్రియేల్‌ గుజ్జుల, ఎరహార్డ్‌ లూగ్వింగ్‌ బోయిచ్చర్‌, మైరెక్‌బ్రూనె బోయిచ్చర్‌, ఫ్రాంక్‌ గ్యూంటర్‌ రూఫర్స్‌ బర్జర్‌, క్రిస్టన్‌ మార్గరెట్‌ ఉన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా సంబంధిత కార్యక్రమాలు, విద్యార్థుల నైపుణ్యాలను స్కూల్‌ కరస్పాండెంట్‌ ఆర్‌. సత్యనారాయణ వారికి వివరించారు.

Skill Development: స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సొంత భవనం

ఈ సందర్భంగా జర్మనీ దేశ బృంద సభ్యులు మాట్లాడుతూ ఉన్నత చదువులతోనే తాము జర్మనీలో మనుగడ సాగిస్తున్నామని తెలిపారు. చదువుతోపాటు కమ్యునికేషన్‌ స్కిల్‌ ఉంటే ఏ దేశంలోనైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. గోపాలం, సెక్రటరీ ఎం. నరసింహారావు, ట్రెజరర్‌ డి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

TS Tenth Class: పదో తరగతి వార్షిక పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన

#Tags