Private Unaided Schools: విద్యా హక్కు చట్టంతో ఉచిత విద్య.. దరఖాస్తులకు చివరి తేదీ!
తిరుపతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1) (సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం మంది విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 2024–25వ విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 34 మండలాలకు గాను 31 మండలాల నుంచి 1,407 మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనలకు లోబడి ఉన్న 1,024 మంది దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అందులో 827 మందిని ఎంపిక చేస్తూ విద్యాశాఖ మొదటి విడత జాబితాను విడుదల చేసింది.
Students Excursion: ఉత్తమ మార్కులకు విహార యాత్ర అవకాశం.. ఈ విద్యార్థులకే..
జిల్లాలో ఎంపిక ఇలా..
విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్‌ఈ వెబ్ పోర్టల్‌లో జిల్లాలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌లు అమలుచేస్తున్న జిల్లాలోని 402 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. అందులో భాగంగానే విడుదల చేసిన తొలి విడత జాబితాలో 827మంది విద్యార్థులు సీట్లు పొందనున్నారు.
20లోపు అడ్మిషన్లు పొందాలి
విద్యాశాఖ విడుదల చేసిన జాబితా మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన 827 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 600 మందికి పైగా అడ్మిషన్లు పొందారు. మిగిలిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికైన పాఠశాలలకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.
Tenth Supplementary: ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
సద్వినియోగం చేసుకోండి
ఉచిత విద్యాహక్కు చట్టం మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలివిడత జాబితాలో 827మంది లబ్ధి పొందగా, వారిలో 600కుపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన వారు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికైన ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.
– శేఖర్, డీఈఓ, తిరుపతి
TS EAMCET 2024 Top Rankers: ఎంసెట్ ఫలితాల్లో టాప్-10లో ఒకే ఒక్క అమ్మాయి