Model School Entrance Exam: నేడు మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్నవారు నేడు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. నేటి ప్రవేశ పరీక్ష వివరాలు..

కై లాస్‌నగర్‌: తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్ష జిల్లాలో ఆదివారం నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనుండగా, ఏడు నుంచి పదో తరగతిలోని ఖాళీల భర్తీ కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

Annual Exams: ప్రారంభమైన వార్షిక పరీక్షలు.. ఎప్పటివరకు..!

ఇందుకోసం జిల్లాలోని జైనథ్‌, నార్నూర్‌, గుడిహత్నూర్‌, ఆదిలా బాద్‌ రూరల్‌ మండలంలోని బంగారిగూడ, బజార్‌హత్నూర్‌, బోథ్‌ మోడల్‌ స్కూళ్లతో పాటు ఆదిలాబాద్‌ పట్టణం ఓల్డ్‌ హౌసింగ్‌బోర్డులోని సరస్వతి శిశు మందిర్‌, లిటిల్‌ ప్లవర్‌ హైస్కూల్‌ వంటి ఎనిమిది కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం జరిగే పరీక్షకు 1,416 మంది విద్యార్థులు హాజరుకానున్నా రు. అలాగే మధ్యాహ్నం నిర్వహించే పరీక్ష కు 1,064 మంది హాజరుకానున్నట్లు డీఈఓ ప్రణీత తెలిపారు. ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లుగా ఆమె పేర్కొన్నారు.

Free Training for Women: నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు వివరాలు..

#Tags