Nadu-Nedu schools: రూ.492 కోట్లతో పాఠశాలల అభివృద్ధి..

అత్యాధునికంగా తీర్చిదిద్ది, మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో కాకినాడ జిల్లాలోని 1,385 ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.492 కోట్లతో అభివృద్ధి చేశారని ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్‌ యనమల నాగార్జున యాదవ్‌ అన్నారు.
నాడు–నేడు పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న నాగార్జున యాదవ్‌

ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ జిల్లాకు వచ్చిన ఆయన చిత్రాడ, కత్తిపూడి, బెండపూడి, కట్టమూరు, మల్లిసాల ప్రాంతాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను అధికారులతో కలసి సందర్శించారు. ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 
అనంతరం కాకినాడలో విలేకర్లతో మాట్లాడుతూ, పేదల కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రతి పాఠశాలలో దాదాపు 10 రకాల మౌలిక వసతులు కల్పించాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రూ.17 వేల కోట్లకు పైగా వెచ్చించి, ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారని నాగార్జున యాదవ్‌ అన్నారు. కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రాధాకృష్ణయ్య, డీఈ వెంకటరాజు, ఏఈలు శ్రీనివాసరావు, రామ్‌శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమ‌లుపై అభిప్రాయాలు ఇవే..

#Tags