AP Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

గురుకుల ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇదే విధంగా ప్రవేశ పరక్ష వివరాలను కూడా వివరించారు.

 

ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో–ఆర్డినేటర్‌, బనవాసి ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయం శ్రీనివాస్‌గుప్త తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ గురుకుల పాఠశాలలో 2024–2025 విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థినులు ఈ నెల 31వ తేదిలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష 25.04.2024న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. https://aprs.apcfss.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Junior Colleges: పాఠశాలలో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు మంజూరు

అదేవిధంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిగ్రీలో మొదటి సంవత్సరం ప్రవేశానికి కూడా దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి రాయలసీమ విద్యార్థులకు గ్యారంపల్లి, కొడగనహళ్లి, నాగార్జునసాగర్‌లో 30 శాతం సీట్లు రిజర్వేషన్‌ ఉంటుందని చెప్పారు.

DSC New Schedule: విడుదలైన డీఎస్‌సీ పరీక్ష కొత్త షెడ్యూల్‌

అలాగే ఓకేషనల్‌ కోర్సు ఈఈటీ, సీజీడీటీకి నిమ్మకూరులో సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ నెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష 25.04.2024న మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు ఉంటుందని చెప్పారు. https://aprs.apcfss.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Civil Engineering: సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యలో ఉపాధికి ఢోకా లేదు

#Tags