School Admissions: ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు.. చివరి తేదీ..?

వచ్చేనెలలో నిర్వహించనున్న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు అర్హత, ఆసక్తి ఉన్న వారంతా ప్రకటించిన తేదీలోగా దరఖాస్తుల చేసుకోవాలని తెలిపారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌. దరఖాస్తులు, పరీక్ష తదితర వివరాలను పరిశీలించండి..

అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశా­ల­కు ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహి­స్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమి­షన­ర్‌ సురేశ్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆయా మండలా­ల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు–2024 జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం

ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం ద­రఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాసమంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. www.cse.ap.­gov.in/­­­apms.ap.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Papers Evaluation: మూల్యాంకన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి

#Tags