World Tourism Day Competitions: ప‌ర్యాట‌న దినోత్స‌వం సంద‌ర్భంగా పోటీల నిర్వాహ‌ణ‌

ప‌ర్య‌ట‌క దినోత్సవంలో విద్యార్థుల‌కు నిర్వ‌హించే పోటీల గురించి స‌హాయ సంచాల‌కులు తెలిపారు. ఈ పోటీల్లో ఇత‌ర పాఠ‌శాల విద్యార్థులు కూడా పాల్గొన‌వ‌చ్చ‌ని స్ప‌ష్టించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివరాలు..
Assistant director announces the competition of world tourism day

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు పర్యాటకశాఖ సహాయ సంచాలకులు వి.స్వామినాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 10.30 గంటల నుంచి లాలాచెరువు పోస్టాఫీసు పక్కనే గల ఎల్‌ఎంసీహెచ్‌ స్కూల్లో పర్యాటకం పర్యావరణంపై పెట్టుబడులు డ్రాయింగ్‌ పోటీలు, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకం ప్రగతి కేతనంలో స్థానికుల భూమిక అంశంపై వక్తృత్వం పోటీలు జరుగుతాయన్నారు.

Sports for Students: క్రీడా జీవితంలో విద్యార్థుల స‌త్తా చాటాలి

ఇప్పటికే యువటూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేసిన పాఠశాలలతో పాటు, వాటిని ఏర్పాటు చేసే ఆసక్తి ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. విజేతలకు అదే రోజు సాయంత్రం బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. ఆసక్తి కలవారు కె.సురేష్‌ కుమార్‌ను 70365 30828 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

#Tags