విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
నవంబర్ 18న జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ – గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సిద్ధార్థ యోగా విద్యాలయం, డాక్టర్ రాంచంద్ర చారిటబు ల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య దినోత్సవంపై ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సహకారంతో నిర్వహించనున్న ఈ పోటీలకు జిల్లాలో పాఠశాల స్థాయిలో ఈనెల 14న 8, 9 తరగతుల విద్యార్థులకు ‘మానవ జీవన విధానంలో ప్రకృతి పాత్ర’ అంశంపై తెలుగు భాషలో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. అందులో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు.
Archery: ఆర్చరీలో విశ్వకవి విద్యార్థుల ప్రతిభ
మండల స్థాయి పోటీల విజేతల్ని జిల్లా స్థాయికి పంపుతారు. హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో ఈనెల 17న జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 18న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల వేదిక హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి 98498 34110, వడ్డేపల్లి సతీశ్‌ప్రకాశ్ 94401 46460 నంబర్లలో సంప్రదించాలని జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు.