Breaking News All Schools Holiday: స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. కలెక్టర్‌ ఆదేశాలు

సాక్షి, ఎడ్యుకేషన్‌: విద్యార్థులకు ఈమధ్యకాలంలో మరోసారి వరుసగా సెలవులు వస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు.నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
Breaking News All Schools Holiday Due to heavy rains schools holiday

దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

ఇప్పటికే తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్‌ శుభం భన్సల్‌ సెలవు ప్రకటించారు.వరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి సెల‌వుల వివ‌రాలు ఇవే...

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags