Best School Award: ముచ్చటగా మూడోసారి..బెస్ట్‌ స్కూల్‌గా అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పాఠశాల

కర్నూలు సిటీ: ముచ్చటగా మూడోసారి రాష్ట్ర స్థాయిలో నగరంలోని డా.ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ బెస్ట్‌ స్కూల్‌గా ఎంపికైంది. ఏటా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ యాజమాన్యాల పరిఽధిలోని స్కూళ్లను ఉత్తమ అవార్డులకు ఎంపిక చేస్తారు.

కర్నూలు జిల్లా నుంచి నగరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ఎంపికై ంది. ఈ స్కూల్‌నుంచి 2023–24 విద్యా సంవత్సరంలో 48 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ 500కు పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. వీళ్లు అర్హులు

షేక్‌ హూమేరా ఇక్బాల్‌ అనే విద్యార్థి ఏకంగా 593 మార్కులు సాధించింది. ఈ నెల 15వ తేది జరిగే స్వాంత్రత్య వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ స్కూల్‌ అవార్డు అందుకోనున్నట్లు ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు.
 

#Tags