BC Department of Welfare: కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలు
మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి మండలానికో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను, ‘మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వె నుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)’కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో.. పరిశీలన జరిపేందుకు ప్రతిపాదనలను సూచించారు.
చదవండి: Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షలకు ఆఖరి తేదీ..!
గురుకులాల కోసం డిమాండ్: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 292 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున ఉండగా, డిమాండ్ మేరకు పలుచోట్ల అదనంగా ఏర్పాటు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా పెద్ద సంఖ్యలో బీసీ గురుకులాల కోసం డిమాండ్ ఉంది. ఏటా అడ్మిషన్ల సమయంలో వేల మంది బీసీ గురుకుల సొసైటీ కార్యాల యం వద్ద పడిగాపులు పడటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో మండలానికో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
చదవండి: Jobs: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రాధాన్యత క్రమంలో..: కొత్తగా బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజా గా కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలెన్ని? ఎక్కడెక్కడ ఉన్నాయి? మండలాల వారీగా విభజిస్తే ఏయే ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలి? తదితర అంశాలను తేల్చి.. ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు కు కార్యాచరణ రూపొందించాలని బీసీ గురుకుల సొసైటీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.