Anganwadi Schools: అంగన్వాడి కేంద్రాలు మోడల్‌ కేంద్రాలుగా..

జిల్లాలో ఉన్న ప్రతీ అంగన్వాడి కేంద్రాల్ని ప్రభుత్వం మోడల్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలను విద్యార్థులకు, చిన్నారులకు సులువుగా ఉండేలా చర్యలు తీసుకొని తీర్చిద్దిదారు..

పెద్దపల్లిరూరల్‌: చిన్నారులకు పోషక, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య అందించే అంగన్‌వాడీ కేంద్రాలు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటున్నాయి. జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం ప్రాజెక్టుల పరిధిలో 706 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 24 కేంద్రాలు మోడల్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. మరో 16 కేంద్రాలను మోడల్‌ అంగన్‌వాడీలుగా మార్చేందుకు ప్రతిపాదించారు.

TET 2024 Preparation: ‘టెట్‌’కు సన్నద్ధం.. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల వివరాలు ఇలా..

గోడలపై అక్షరాలు.. ఆకర్షణీయబొమ్మలు

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆట, పాటలతో అక్షరాలు నేర్పిస్తున్నారు. మోడల్‌ అంగన్‌వాడీల్లో గోడలపై ఆకర్షణీయంగా ఉండేలా.. చిన్నారులకు సులువుగా అర్థమయ్యేలా గోడబొమ్మలను చూపిస్తూ అవగాహన పెంచుతున్నారు. అంతేకాకుండా ఆడుకునేందుకు అవసరమైన కొన్ని బొమ్మలను కూడా ఈ మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చేందుకు చిన్నారులు ఆసక్తిని చూపుతున్నారు.

Model Foundation School: ఈ పాఠశాలలే మోడల్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా ఎంపికైయ్యాయి

జిల్లాలో పూర్తయిన కేంద్రాలివే..

జిల్లాలో ఇప్పటివరకు 24 అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఒక్కో కేంద్రానికి దాదాపు రూ.2లక్షల వరకు వెచ్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. పెద్దపల్లి మండలంలో కాసులపల్లి, పెద్దపల్లి (శాంతినగర్‌), చందపల్లి, సుల్తానాబాద్‌ మండలంలో దేవునిపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో పెగడపల్లి, ఎలిగేడు మండలంలో ర్యాకల్‌దేవ్‌పల్లి, జూలపల్లి మండలంలో కుమ్మరికుంట, ఓదెల మండలంలో నాంసానిపల్లి, ధర్మారం మండలంలో చామన్‌పల్లి, మంథని మండలంలో దుబ్బపల్లి, రామగిరి మండలంలో నాగెపల్లి, సింగిరెడ్డిపల్లి, కమాన్‌పూర్‌ మండలంలో లింగాల, కమాన్‌పూర్‌–1, జూలపల్లి–2, ముత్తారం మండలంలో లక్కారం–1, అంతర్గాం మండలంలో మద్దిర్యాల, ముర్మూరు, అక్బర్‌నగర్‌, పొట్యాల–1, పాలకుర్తి మండలంలో వేంనూర్‌, బసంత్‌నగర్‌–1, కుక్కలగూడురు–2, ముంజంపల్లి.

KGBV Admissions: కేజీబీవీల్లో బాలికల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేదీ..!

ప్రతిపాదించిన కేంద్రాలు

జిల్లాలో మరో 16 అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్‌ అంగన్‌వాడీలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రతిపాదించారు. అందులో పెద్దపల్లి పట్టణంలోని కేంద్రంతో పాటు పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట 1, 2, 3 కేంద్రాలు, మండల కేంద్రమైన ధర్మారం, జూలపల్లి, సుల్తానాబాద్‌, గర్రెపల్లి, అంతర్గాంలో మూడు, పాలకుర్తి మండలం కుక్కలగూడురు, మంథని మండలం వెంకటాపూర్‌, గుంజపడుగులో రెండు కేంద్రాలు, మండల కేంద్రమైన ముత్తారంలోని అంగన్‌వాడీ కేంద్రాలు మోడల్‌ అంగన్‌వాడీలుగా మారనున్నాయి.

Govt teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్‌ కోడ్‌

ఆహ్లాదంగా ఉండేలా..

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దుతున్నాం. చిన్నారులు ఆడుకుంటూనే అక్షరాలు, వస్తువులపై అవగాహన పెంచేలా గోడలపై బొమ్మలు వేయించాం. కొన్ని బొమ్మలను అందుబాటులో ఉంచాం. మోడల్‌ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అక్షరాలతో పాటు వస్తువులు, మనుషులు, జంతువులపై అవగాహన పెరుగుతుంది.

– రవుఫ్‌ఖాన్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

#Tags