AP Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి భారీ డిమాండ్‌.. పరీక్షకు తేదీ విడుదల..!

ఏపీలో మోడల్‌ స్కూళ్లలో ఇప్పటికే ప్రవేశానికి దరఖస్తుల సంఖ్య పెరిగిపోతుంది. కాగా, ఆ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలను వెల్లడించి ప్రవేశ పరీక్షకు తేదీని ప్రకటించారు..

రాయదుర్గంటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్‌ స్కూల్‌)లో 6వ తరగతి ప్రవేశాలకు భారీ డిమాండ్‌ నెలకొంది. జిల్లాలోని 15 ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉండగా మంగళవారం నాటికి 3,268 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 6వ తేదీ వరకూ దరఖాస్తుకు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఒక్కో మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో వంద సీట్లకు ప్రవేశాలకు ఈ నెల 21న ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

Summer Holidays: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు.. ఎప్పటి వరకు..?

జిల్లాలో రాయదుర్గం మోడల్‌స్కూల్‌లో ప్రవేశాలకు అత్యధికంగా 452 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా రెండో స్థానంలో గుత్తి మోడల్‌ స్కూల్‌లో 441 మంది, మూడో స్థానంలో పామిడి మోడల్‌ స్కూల్‌లో 335 మంది, నాల్గో స్థానంలో గార్లదిన్నె మోడల్‌ స్కూల్‌లో 289 మంది, తాడిపత్రి మోడల్‌ స్కూల్‌లో 273 మంది, రాప్తాడులో 247, కళ్యాణదుర్గంలో 234 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా యల్లనూరు మోడల్‌ స్కూల్‌లో 82 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Gurukul School Principal: ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదు..! కారణం..

#Tags