Summer Holidays: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు.. ఎప్పటి వరకు..?
అనంతపురం: 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకూ అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.
Jobs With Huge Salary: ఉద్యోగాల భర్తీ..నెలకు లక్షన్నరకు పైగా జీతం, ఎక్కడో తెలుసా?
ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తయి పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఇక 1–9 తరగతుల విద్యార్థులకు ఈనెల 6 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 19 నుంచి 21లోపు ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. చివరి రోజున ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందజేయనున్నారు.
Donald Trump: రూ.1,460 కోట్ల బాండ్ సమర్పించిన ట్రంప్.. దేనికంటే..
పరీక్షల షెడ్యూలు ఇలా...
6వ తేదీ 1–9 తరగతులకు మొదటి లాంగ్వేజ్, 8వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్ పార్ట్–ఏ, 6 నుంచి 9 తరగతులకు సెకండ్ లాంగ్వేజ్, 10వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్ పార్ట్–బీ (టోఫెల్), 6 నుంచి 9 తరగతులకు ఇంగ్లిష్ పార్ట్–ఏ, 12వ తేదీ 1–5 తరగతులకు గణితం, 6–9 తరగతులకు ఇంగ్లిష్ పార్ట్–బీ (టోఫెల్), 13వ తేదీ 3–5 తరగతులకు ఈవీఎస్, 6–9 తరగతులకు గణితం, 15వ తేదీ 3–5 తరగతులకు ఓఎస్‌ఎస్సీ, 6 నుంచి9 తరగతులకు ఫిజికల్ సైన్స్, 16వ తేదీ 4వ తరగతి విద్యార్థులకు (ఎంపిక చేసిన స్కూళ్లు) స్లాస్–2024 పరీక్ష, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు బయాలజికల్ సైన్స్, 18న సోషల్ పరీక్ష ఉంటుంది. 1–8 తరగతుల విద్యార్థులకు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు 9 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు.
Tags
- Summer Holidays
- School Students
- board examinations
- exams evaluation
- Tenth Class Students
- Annual exams schedule
- Primary and High Schools
- exam schedule
- Students
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Holidays announcement
- Annual Exams
- Tenth Class
- Evaluation
- exam schedule
- sakshieducation updates