Private Schools Admissions: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు కడితేనే అడ్మిషన్..! లేకుంటే..
విశాఖ విద్య: ‘రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, ఉచిత సీట్లు పథకం కొనసాగిస్తారో.. లేదోననే’ సాకుతో బడా స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా తిప్పి పంపిస్తున్నారు. మండల విద్యాశాఖాధికారులకు ఈ వ్యవహారం తీవ్ర తలనొప్పిగా మారింది.
NEET UG 2024: నీట్ పరీక్షను రద్దు చేయాలి
ప్రైవేటులో ఉచిత విద్య పథకంలో భాగంగా తొలి దశలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 వేలకు పైగానే సీట్లు పొందారు. వీరిలో ఎంతమంది చేరారనే లెక్కలు తీస్తున్నారు. తాజాగా రెండో విడతలో 3,257 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఆయా పాఠశాలల్లో సోమవారం 5 గంటల్లోగా అడ్మిషన్లు ఇప్పించాలని విద్యాశాఖ ఆర్జేడీ బి.విజయ భాస్కర్ మండల స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
TS Inter Colleges Admissions 2024-25 : ఇంటర్ విద్యార్థులకు బోర్డు కీలక హెచ్చరిక.. ఈ కాలేజీల్లో..
25 శాతం సీట్లు ఇవ్వాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రైవేటు స్కూళ్లలోనూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేలా ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలని ఆదేశించింది. జాతీయ విద్యా విధానాన్ని పకడ్బందీగా అమలు చేసే క్రమంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని రాష్ట్రంలో పకడ్బంధీగా వర్తింపజేసింది. కానీ ప్రస్తుత పరిణామాలతో చక్కటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్మిషన్లకు కుంటిసాకులు
ఉచిత సీటు లభించినా, కొన్ని ప్రైవేటు యాజమాన్యాల వారు కుంటిసాకులతో అవాంతరాలు సృష్టిస్తూ, విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. . రెవెన్యూ కార్యాలయం నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించినా, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారి శాలరీ సర్టిఫికెట్లు సైతం తెస్తేనే సీటు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
Quality Education: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించే బాధ్యత ఉపాధ్యాయులదే..
సీటు ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తాం
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉచిత సీటు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాల్సిందే. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయమని డీఈవోలకు ఆదేశాలిచ్చాం. మండలాల వారీగా ప్రోగ్రస్ ఎలా ఉందనేది సమీక్షిస్తున్నాం. ఉచిత అడ్మిషన్లు ఇవ్వలేదని మా దృష్టికొస్తే, అలాంటి స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తాం.
– బి.విజయ భాస్కర్, ఆర్జేడీ, విశాఖపట్నం
Silver CET 2024: సిల్వర్ సెట్ పరీక్షకు గడువు పొడగింపు.. చివరి తేదీ ఇదే!