Private Schools: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో రిజర్వేషన్లు

విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలనే నిర్ణయాలన్ని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ తెలిపారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని 12(1)(సి) కింద ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. విద్యార్థులు సైతం అదే పోర్టల్‌లో ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Degree Results: విడుదలైన డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు..

తొలి విడతలో లాటరీ విధానంలో ఎంపికయ్యే విద్యార్థుల వివరాలను ఏప్రిల్‌ 1వ తేదీన ప్రచురిస్తారని తెలిపారు. ఏప్రిల్‌ 2 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థుల ఎంపికలను ధ్రువీకరించనున్నట్లు చెప్పారు. రెండో విడత లాటరీలో ఎంపికై న విద్యార్థుల వివరాలను ఏప్రిల్‌ 15వ తేదీన ప్రచురిస్తారని వెల్లడించారు. ఎంపికై న విద్యార్థుల ప్రవేశాలను ఏప్రిల్‌ 16 నుంచి 23వ తేదీ వరకు ధ్రువీకరించనున్నట్లు వివరించారు.

#Tags