UGC NET June 2024 Results: యూజీసీ-నెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోవచ్చు!
యూజీసీ-నెట్ జూన్ 2024 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. రేపు(అక్టోబర్ 18)న ఫలితాలను విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగి నెల రోజులు దాటినా ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ
ఈ క్రమంలో రేపు ఫలితాలను విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ లాగిన వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
కాగా భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ అలాగే ‘జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్’ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ నెట్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు
యూజీసీ నెట్ 2024 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
- యూజీసీ అఫీషియల్ వెబ్‌సైట్ugcnet.nta.ac.in.ను క్లిక్ చేయండి.
- హోంపేజీలో కనిపిస్తున్న "Public Notices" అనే లింక్‌ను క్లిక్ చేయండి.
- తర్వాతి పేజీలో "UGC NET June 2024 Result." అనే లింక్‌ను క్లిక్ చేయండి.
- స్క్రీన్‌పై మీ స్కోర్‌కార్డ్ డిస్‌ప్లే అవుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
#Tags