ICAR-ASRB Recruitment 2024: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఏఎస్‌ఆర్‌బీ).. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌)లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్‌లు చదివి ఉండాలి.
పని అనుభవం: కేంద్ర/రాష్ట్ర గుర్తింపు సంస్థ విద్యా సంస్థల్లో హిందీ,ఇంగ్లిష్‌లో మూడేళ్లు బోధించిన అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో హిందీ నుంచి ఇంగ్లిష్‌ అనువాదం చేసిన అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. 

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌–కమ్‌–డిస్క్రిప్టివ్‌ పరీక్ష. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 03.04.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.05.2024
ఆబ్జెక్టివ్‌ కమ్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్ష తేది: 01.09.2024

వెబ్‌సైట్‌: http://www.asrb.org.in/

చదవండి: TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags