Skip to main content

CSIR-IITR Recruitment 2024: సీఎస్‌ఐఆర్‌-ఐఐటీఆర్ లో టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లక్నోలోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌ (ఐఐటీఆర్‌) టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-IITR Technician Job Vacancy Announcement  CSIR-IITR Recruitment 2024 For Technical Assistant and Technician Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌-08, టెక్నీషియన్‌-11.
విభాగాలు: కెమికల్‌ సైన్సెస్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, యానిమల్‌ హౌస్‌ అండ్‌ జీఎల్‌పీ ఫ్యాకల్టీ, బయోలాజికల్‌ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్‌ మానిటరింగ్, ఎపిడెమియాలజీ, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, సెన్సార్‌ అండ్‌ డివైజ్‌ డెవలప్‌మెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్‌-ఏసీ టెక్నీషియన్, కంప్యూటర్‌ సైన్స్‌.

అర్హతలు
టెక్నికల్‌ అసిస్టెంట్‌: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ(కెమికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సబ్జెక్ట్‌లు), డిప్లొమా(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్, మెకానికల్‌) ఉత్తీర్ణువ్వాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం ఉండాలి.
టెక్నీషియన్‌: కనీసం 55% మార్కులతో ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.­63,312, టెక్నీషియన్‌ పోస్టులకు రూ.34,625.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.

వెబ్‌సైట్‌: https://www.csir.res.in/

చదవండి: NI-MSME Recruitment 2024: ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Mar 2024 11:54AM

Photo Stories