Skip to main content

ASL DRDO Recruitment 2024: ఏఎస్‌ఎల్‌-డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో 90 అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)-డా.ఎ.పి.జె. అబ్దు ల్‌ కలామ్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎన్‌ఎల్‌)లో ఒక ఏడాది అప్రెంటిస్‌షిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
DRDO Recruitment Notice    Apprentice Jobs in ASL-DRDO Hyderabad   Apprenticeship Training Opportunity

మొత్తం ఖాళీల సంఖ్య: 90
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-15, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు-10, ట్రేడ్‌(ఐటీఐ) అప్రెంటిస్‌లు-65.
అర్హత: 2021, 2022, 2023 సంవత్సరాల్లో రెగ్యులర్‌గా డిగ్రీ/డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. పీజీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎస్‌ఎల్‌), కాంచన్‌బాగ్‌ పీఓ, హైదరాబాద్‌-500058 చిరునామకు రిజిస్టర్డ్‌ పోస్ట్‌/స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 15 రోజుల వరకు.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చదవండి: IISER Recruitment 2024: ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 01:02PM

Photo Stories