Indian Railway Recruitment: రైల్వేలో 5066 పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ముంబైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వరాఆ మొత్తం 5066 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 5066
ఖాళీల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.
CTET 2024 Exam Postponed: సీటెట్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 15-24 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ సమయం: ఒక ఏడాది పాటు
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 639 పోస్టులు
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 22, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)