Act Apprentice in RRC : ఆర్‌ఆర్‌సీ–వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ ఉద్యోగాలకు శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)–వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/యూనిట్‌లలో యాక్ట్‌ అప్రెంటిస్‌ల శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

»    ఆర్‌ఆర్‌సీ డివిజన్‌/యూనిట్‌లు: జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, హెచ్‌క్యూ/జేబీపీ.
»    మొత్తం ఖాళీల సంఖ్య: 3,317.
»    ట్రేడ్‌లు: ఏసీ మెకానిక్, బుక్‌ బైండర్, కార్పెంటర్, డీజిల్‌ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్‌ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్‌ తదితరాలు.
»    అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 05.08.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.09.2024
»    వెబ్‌సైట్‌: https://wcr.indianrailways.gov.in

NMMS Exam Notification : విద్యార్థుల ఉన్న‌త చ‌దువుకు ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ త‌ర‌గ‌తుల‌కే..!

#Tags