Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. జీతం రూ. 30వేలు

క్రోసూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి కె.సంజీవరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

Dell Work From Office: వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఫుల్‌స్టాప్‌ పెట్టిన ప్రముఖ ఐటీ కంపెనీ..

జాబ్‌మేళాలో సుమారు ఐదు కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. జీతం వారి విద్యార్హతను బట్టి రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, డిప్లమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు 18–35 సంవత్సరాల లోపు హాజరుకావచ్చన్నారు.

AP Govt Job Notification 2024: ఏపీ 'నిట్‌'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే

ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని 8074393466 సంప్రదించి తెలుసుకోవచ్చునన్నారు. httr//rkiuniverre .aprrdc.in నందు రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు జాబ్‌మేళాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు.

జాబ్‌మేళా ముఖ్య సమాచారం:

అర్హత: 10వ తరగతి/డిప్లొమా/డిగ్రీ/పీజీ
వయస్సు: 18- 35 ఏళ్ల లోపు ఉండాలి

KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం..

జాబ్‌మేళా తేదీ: సెప్టెంబర్‌ 28(రేపు)
జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, పెదకూరపాడు

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9- సా. 4 గంటల వరకు
మరిన్ని వివరాలకు: 8074393466 సంప్రదించండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags