Contract Jobs: ఒప్పంద ప్రాతిపదికన పోస్టులకు దరఖాస్తులు..

ఈ సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులకు దరఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేషన్‌: న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ(సీఎమ్‌ఎస్‌ఎస్‌)..ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌–05, మేనేజర్‌–08, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01, వేర్‌హౌస్‌ మేనేజర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంఎస్సీ, బీకాం, బీఫార్మా, ఎంఫార్మా, బీఈ, బీటెక్‌ డిగ్రీ  ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,00,000, మేనేజర్, వేర్‌హౌస్‌ పోస్టులకు రూ.50,000, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,000.  
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో తమ డేటాను ది జనరల్‌ మేనేజర్‌(అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ, రెండో ఫ్లోర్, విశ్వయువక్‌ కేంద్ర, టీన్‌ మూర్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
»    వెబ్‌సైట్‌: జ్టి్టpట://ఛిఝటట.జౌఠి.జీn


 

#Tags