Job Mela For Freshers: పదో తరగతి అర్హతతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ ఆర్ ఐటీఐలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, మూత్తూట్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీలు పాల్గొంటాయని ఆమె పేర్కొన్నారు. టెన్త్ పాసై డిగ్రీ చదివిన 18 ఏళ్లు నిండిన 30 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు.
జాబ్ మేళాలో ఎంపికై న వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వేతనం అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 94910 57527, 93983 38105 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.
ముఖ్య సమాచారం:
ఎప్పుడు: జనవరి 10న
ఎక్కడ: ఐటీఐ కళాశాల, అరకులోయ
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్‌మేళా, ఇంటర్వ్యూ వివరాలివే!
విద్యార్హత: టెన్త్/ డిగ్రీ
వయస్సు: 18- 30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000- 16,000/-
మరిన్ని వివరాలకు: 94910 57527, 93983 38105 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags