Job Mela For Freshers: రేపు జాబ్‌మేళా.. పూర్తివివరాల కోసం క్లిక్‌ చేయండి

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు కలెక్టరేట్‌ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ/డీఎల్‌టీసీలో ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు, డీఎల్‌టీసీ ప్రిన్సిపాల్‌ ఉగాది రవి సంయుక్త ప్రకటనలో తెలిపారు. టీవీఎస్‌ ట్రైనింగ్‌ అండ్‌ సర్వీస్‌(శ్రీసిటీ), ఐఎంఓపీ–జపనీస్‌ ఎంఎన్‌సీ (శ్రీసిటీ), మోహన్‌ స్పిన్‌ టెక్స్‌ (మల్లవల్లి, హనుమాన్‌ జంక్షన్‌) కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Job Mela For Freshers

టీవీఎస్‌ కంపెనీలో ట్రైనీ ఆపరేటర్‌ పోస్టులకు ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ డిప్లొమా కలిగిన 18 నుంచి 23 ఏళ్ల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఐఎంఓపీ కంపెనీలో అప్రెంటీస్‌ కోసం పురుష మెషీన్‌ ఆపరేటర్‌, టెక్నీషియన్‌ పోస్టులకు ఐటీఐ ఫిట్టర్‌/వెల్డర్‌ విద్యార్హత కలిగి 17 నుంచి 23 ఏళ్ల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు.

Employment Fair 2024: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలు ఇవే

మోహన్‌ స్పిన్‌టెక్స్‌లో గార్డ్స్‌, సహాయకులు/గార్డ్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్‌ 88868 82032 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

విద్యార్హత: డిప్లొమా ఐటీఐ
వయస్సు: 17-23 ఏళ్లకు మించకూడదు

Job Fair 2024 For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

ఎప్పుడు: డిసెంబర్‌ 17న
ఎక్కడ: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ఏలూరు

వివరాలకు: 8886882032 సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags