Civils Services Prelims Exam 2024: జూన్ 16న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. ప్రిపరేషన్‌కు ప్రణాళిక ఇలా..!
సాక్షి ఎడ్యుకేషన్: సివిల్ సర్వీసెస్‌లో ఉండే మూడు దశల ఎంపిక ప్రక్రియలో.. అత్యంత కీలకమైంది తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష! దేశవ్యాప్తంగా దాదాపు అయిదు లక్షల మంది హాజరయ్యే ప్రిలిమ్స్‌లో నెగ్గితేనే.. మలిదశ మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది!! సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్–2024కు సంబంధించి తొలిదశ ప్రిలిమ్స్ జూన్ 16న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్‌లో విజయానికి ప్రిపరేషన్ టిప్స్..
సివిల్స్ ప్రిలిమ్స్‌ను వడపోత పరీక్ష అని చెప్పొచ్చు. ఎందుకంటే.. దాదాపు ఐదు లక్షల మంది పరీక్ష రాస్తే.. అందులో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య సుమారు 13 వేలు మాత్రమే! లక్షల మంది పోటీ పడే ప్రిలిమ్స్ నుంచి వేల సంఖ్యలోని జాబితాలో చోటు సంపాదించి మలి దశకు అర్హత పొందాలంటే.. అత్యంత మెరుగైన ప్రిపరేషన్‌తోనే సాధ్యం అవుతుంది.
UGC: డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్.. యూజీసీ సూచనలు ఇలా..
21 సర్వీసులు.. 1,056 పోస్ట్‌లు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2024 ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా మొత్తం 21 సర్వీసుల్లో 1,056 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. పేపర్ 1 జనరల్ స్టడీస్ (200 మార్కులు), పేపర్ 2 సీశ్యాట్ (200 మార్కులు) ఉంటాయి. పేపర్1లో వచ్చిన మార్కులు మెయిన్‌కు ఎంపికలో అత్యంత కీలకం. పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
సమయ పాలన
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు నిత్యం పునశ్చరణ, ప్రాక్టీస్‌తో తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టుకోవాలి. మెయిన్స్ ఎంపికకు నిర్ణయాత్మకమైన పేపర్–1 జనరల్ స్టడీస్‌కు సంబంధించి అన్ని ముఖ్యమైన టాపిక్స్‌ను తరచూ రివైజ్ చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. అందుకోసం ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం కేటాయించుకోవాలి. దీంతోపాటు ప్రతి వారం సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం ఉపయుక్తంగా ఉంటుంది.
Defense Laboratories School: హైదరాబాద్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్‌లో ఈ పోస్టులకు దరఖాస్తులు..
సమకాలీనంతో సమ్మిళితం
ఇటీవల కాలంలో ప్రిలిమ్స్ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఏడాది మే ముందు నుంచి ఏడాది, ఏడాదిన్నర కాలంలోని ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ స్టాటిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా..వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి.
రెండుసార్లు పునశ్చరణ
ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే.. ప్రిపరేషన్ పరంగా కొంత సమయం కలిసొస్తుంది. ప్రిలిమ్స్ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో వారు పూర్తిగా రివిజన్‌కు సమయం కేటాయించుకోవాలి. కనీసం రెండుసార్లు రివిజన్ చేసేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఎక్కువ మంది అభ్యర్థులు రివిజన్‌కు ఉపకరించే విధంగా ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్‌నోట్స్ సిద్ధం చేసుకుంటారు.
NICHDR Contract Posts: ఎన్‌ఐసీహెచ్‌డీఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
సొంత నోట్స్ ఎంతో మేలు
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇందుకోసం ఇప్పటికే వారు రాసుకున్న సొంత నోట్స్‌ను అనుసరించాలి. ప్రిపరేషన్‌లో భాగంగా సొంతంగా రాసుకున్న నోట్స్‌ను తరచూ తిరగేస్తూ ఉండాలి. ముఖ్య టాపిక్స్‌కు సంబంధించి హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, అండర్‌లైన్ చేసినవి సాధ్యమైనన్ని ఎక్కుసార్లు చూసుకోవాలి. ఇది ఆయా అంశాలను పరీక్ష సందర్భంగా అవసరమైన సమయంలో గుర్తుకు తెచ్చుకునేందుకు దోహదపడుతుంది. వీటితోపాటు సొంతంగా సిద్ధం చేసుకున్న నోట్స్‌లో ఉన్న ఫ్లోచార్ట్స్, న్యూమానిక్స్, గ్రాఫ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్‌ను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి.
ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్
గత ఐదారేళ్ల పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ సందర్భంగా ప్రశ్న–సమాధానం గుర్తించడం అనే విధానం కాకుండా.. ఆయా ప్రశ్నలకు అప్షన్లుగా ఇచ్చిన వాటిపైనా దృష్టిపెట్టాలి. ఎందుకంటే.. సివిల్స్ ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు యథాతథంగా రిపీట్ అవడం అరుదుగా జరుగుతుంది. కాని థీమ్స్‌పై ప్రశ్నలు రిపీట్ అవుతుంటాయి. ఉదాహరణకు ఇన్‌ఫ్లేషన్, ఫారిన్ ట్రేడ్, ఎల్ నినో, లా నినో, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ యాక్ట్స్‌పై వివిధ కోణాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Posts at NIN: ఎన్ఐఎన్‌లో ఈ ఉద్యోగాల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
కీలక గణాంకాలు
హిస్టరీ నుంచి ఎకానమీ వరకూ ఆయా సబ్జెక్టుల్లో కొన్ని కీలకమైన గణాంకాలను గుర్తుపెట్టుకోవడం మేలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టు నుంచి ముఖ్యమైన ఫ్యాక్టువల్ డేటాను గుర్తించి.. ఒక ప్రత్యేకమైన నోట్స్‌లో రాసుకుని.. వాటిని పరీక్షకు ముందు రోజు వరకూ తరచూ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అత్యంత కీలకమైన డేటాను గుర్తుపెట్టుకోవడం ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు హిస్టరీలో ముఖ్యమైన రాజ వంశం, వారి పాలనా కాలం, రాజధాని, ముఖ్యమైన రాజు పాలనాకాలం; ముఖ్యమైన రచయితలు–వారి గ్రంథాలు; ముఖ్యమైన విదేశీ యాత్రికులు–వారు ఎవరి కాలంలో భారత్‌ను సందర్శించారు,వారి గ్రంథాలు వంటివి. ఎకానమీలో రెపో రేటు,తాజా వృద్ధి రేట్లు, ఫిజికల్ డిఫిసిటీ, కరెంట్ అకౌంట్ డిఫిసిటీ, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి తదితరాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
పేపర్–2కు కూడా సమయం
అభ్యర్థులు పేపర్–2 (సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొన్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1 మూల్యాంకన చేస్తారు. కాబట్టి పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
Gurukula school admissions: గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు
సబ్జెక్ట్ వారీగా దృష్టిపెట్టాల్సినవి
కరెంట్ అఫైర్స్–ఎన్విరాన్‌మెంట్
అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న గాజా–ఇజ్రాయెల్, రష్యా–ఉక్రెయిన్, నాటో, జీ 20, బ్రిక్స్, దక్షిణ చైనా సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రం, బ్లాక్ సీ, చాబహర్ పోర్టు వంటివాటితోపాటు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నివేదికలు, వివిధ అంతర్జాతీయ ఇండెక్స్‌లపైనా దృష్టిపెట్టాలి. అదేవిధంగా వార్తల్లో ఉన్న జంతువులు, పక్షులు.. ఉదాహరణకు చీతా, టైగర్, డాల్ఫిన్, ఎలిఫెంట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి వాటి ఐయూసీఎన్’ స్టేటస్, అవి ఏ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి, వాటి సెన్సెస్,వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, పర్యావరణ చట్టాలు వంటి వాటిని తెలుసుకోవాలి. ప్రభుత్వ స్కీమ్స్‌తోపాటు కరెంట్ అఫైర్స్‌కు సోర్స్ కూడా ముఖ్యమే. ఇందుకోసం పీఐబీతోపాటు ప్రామాణిక దినపత్రికలు, వెబ్‌సైట్స్‌ను అనుసరించవచ్చు.
చరిత్ర
ప్రాచీన చరిత్రలో సింధూ నాగరికత, బౌద్ధం, జైన మతాలు, మౌర్యులు, గుప్తుల పాలన, శాసనాలు, ముఖ్య ఘట్టాలపై దృష్టిపెట్టాలి. అదేవిధంగా మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, విజయనగర సామ్రాజ్యం కాలంలో జరిగిన కీలక పరిణామాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక అంశాలను రివైజ్ చేసుకోవాలి. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు–ఉద్యమాలు(గిరిజన ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు), సంస్కరణోద్యమాలు, జాతీయోధ్యమం–గాంధీ,అంబేద్కర్ తదితరుల పాత్ర కీలకంగా నిలుస్తాయి.
Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
పాలిటీ
రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, తాజా రాజ్యాంగ సవరణలు –వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు, పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, పంచాయతీ రాజ్ వ్యవస్థ, 5వ, 6వ షెడ్యూల్స్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, మహిళా రిజర్వేషన్ చట్టం, తాజా సుప్రీంకోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలపైనా దృష్టిపెట్టాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; చంద్రయాన్–3, గగన్‌యాన్, ఆదిత్య,రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు, అగ్ని–5, ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు–కారకాలు, వ్యాక్సిన్‌లు, సైబర్ సెక్యూరిటీ,ఏఐ,సోలార్ ఎనర్జీ,సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్æతదితరాల గురించి తెలుసుకోవాలి.
జాగ్రఫీ
ఇండియా ఫిజికల్ ఫీచర్స్, నదీ వ్యవస్థ, భౌగోళిక వనరులు, సహజ వనరులు, సెన్సెస్ 2011, సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, రుతుపవనాలు, పంటలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, భూకంపాలు, సునామీలు, మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ, జలాల పంపిణీ–వివాదాలు, ముఖ్యమైన ప్రాజెక్టులు వంటి వాటిపై దృష్టిపెట్టాలి.