Admissions in NISER: నైసర్ భువనేశ్వర్‌లో ఎంఎస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్), సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 10.
కోర్సు: ఎంఎస్సీ(మెడికల్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు. ఏడాది ఇంటర్న్‌షిప్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. జామ్ 2024/జెస్ట్ 2025 వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: జామ్ 2024/జెస్ట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.04.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31.05.2024.
ఇంటర్వ్యూ తేదీలు: 01.07.2024 నుంచి 04.07.2024 వరకు
తుది జాబితా వెల్లడి: 05.07.2024.
వెబ్‌సైట్: https://www.niser.ac.in/
#Tags